భారతదేశం, డిసెంబర్ 1 -- పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్నవారికి మంచి ఛాన్స్ వచ్చింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారికి ఉపశమనం కలిగించే వార్త ఏంటంటే డిసెంబర్ రెండో వారంలో జరగనున్న దేశవ్యాప్త లోక్ అదాలత్‌లో పెండింగ్ చలాన్లపై 50 శాతం నుండి 100 శాతం వరకు తగ్గింపును అందుకోవచ్చు.

డిసెంబర్ 13వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో పెండింగ్ చలాన్లు, పెనాల్టీలు సెటిల్ చేసుకోవచ్చు. భారీగా తగ్గింపును కూడా పొందవచ్చు.

డిసెంబర్ 13న లోక్ అదాలత్ జరుగుతుంది. తెలంగాణతోపాటుగా మరికొన్ని రాష్ట్రాలు రాయితీ ట్రాఫిక్ చలాన్‌లను అందించడంలో పాల్గొంటాయి. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాలు ఈ అవకాశాన్ని అందిస్తున్నాయి.

హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ లేకుండా వాహనం నడపడం, రెడ్ సిగ్నల్స్ జ...