Telangana,hyderabad, జూలై 31 -- టీజీ సీపీగెట్ - 2025పై కీలక అప్డేట్ వచ్చేసింది. ఎంట్రెన్స్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు. సీపీగెట్ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటన ద్వారా సూచించారు.

ఆగస్టు 4వ తేదీ నుంచి టీజీ సీపీగెట్ - 2025 పరీక్షలు ప్రారంభమవుతాయి. ఆగస్టు 11వ తేదీతో అన్ని సబ్జెక్టుల పరీక్షలు ముగుస్తాయి. ప్రతి రోజూ 3 సెషన్లు ఉంటాయి. ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 1 నుంచి 2.30 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. ఇక చివరి సెషన్ 4.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు.

మొత్తం 45 సబ్జెక్టులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. సబ్జెక్టుల వారీగా తేదీలను https://cpget.tsche.ac.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ఉస్మానియా, తెలంగాణ, కాకత...