భారతదేశం, అక్టోబర్ 26 -- తెలంగాణలోని అడవుల్లో పులుల సంఖ్యను లెక్కించేందుకు అటవీ శాఖ సిద్ధమైంది. నవంబర్ 20వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పులుల లెక్కింపు ప్రక్రియ ముదలు కానుంది. నిజానికి ఈ గణన చాలా రోజుల తర్వాత ప్రారంభం కావాల్సి ఉండేది. కానీ చలికాలం కావడంతో ఈ వాతావరణంలో పులులు, ఇతర వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉంటుందని ముందుగానే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ లెక్కింపుతో పెద్దపులుల ప్రస్తుత స్థితి, సంరక్షణ అంచనా వేసేందుకు వీలుగా ఉంటుంది.

ఈ గణన కోసం అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. లెక్కింపు పద్ధతులపై అధికారులకు శిక్షణ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రతీ జిల్లా నుంచి ఇద్దరు చొప్పున అధికారులు ఈ శిక్షణలో ఉంటారు. పులుల పాదముద్రలు, మలం, కెమెరా ట్రాప్స్ అమర్చడం, ఇతర సాంకేతిక పద్ధతులను ఉయోగించడంవంటి వాటిపై శిక్షణ ఇస్తారు. పులుల సంఖ్యను అత్యంత కచ్చితంగా లెక...