Telangana,basara, జూలై 5 -- తెలంగాణలోని ట్రిపుల్ ఐటీ(ఆర్జీయూకేటీ) క్యాంపస్ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మార్కుల ఆధారంగా.. మెరిట్ లిస్ట్ ను విడుదల చేశారు. వీరికి సంబంధించిన జాబితాను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. అయితే ప్రాథమికంగా ఎంపికైన ఈ విద్యార్థులకు కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన తేదీలను కూడా అధికారులు ప్రకటించారు.

ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో ప్రవేశాలకు ప్రాథమికంగా ఎంపికైన విద్యార్థులకు జూలై 7 నుంచి ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. జూలై 9వ తేదీ వరకు ఈ ప్రక్రియ ఉంటుంది. ఇందుకు హాజరయ్యే విద్యార్థులు. నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కేంద్రానికి రావాల్సి ఉంటుంది.

మరోవైపు ఆర్మీ, NCC, స్పోర్ట్స్, దివ్యాంగులు తదితర ప్రత్యేక కేటగిరీల విద్యార్థులక...