భారతదేశం, డిసెంబర్ 12 -- రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రతకు ప్రజలు వణికిపోతున్నారు. ఏజెన్సీ ఏరియాల్లో పూర్తిగా మంచు కప్పుకుపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చలి గాలుల తీవ్రతకు.. ప్రజలు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.

ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల కారణంగా రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల మేర కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయని తెలిపింది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ ప్రకారం..ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

రేపు(డిసెంబర...