Telangana,hyderabad, అక్టోబర్ 2 -- రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాల టెండర్లకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లాల వారీగా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందుకు అక్టోబర్ 18వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

గతంతో పోల్చితే. ప్రస్తుతం దరఖాస్తు ఫీజు పెరిగింది.టెండర్ల ప్రక్రియలో భాగంగా గతంలో ఒక్కో అప్లికేషన్ ఫీజు రూ.2 లక్షలు ఉండేది. కానీ ఈసారి ఈ ఫీజును రూ. 3 లక్షలుగా నిర్ణయించారు. దీంతో ఒక్కో అప్లికేషన్ కోసం రూ. 3 లక్షల నాన్‌ రిఫండబుల్‌ కింద డబ్బులను చెల్లించాలి. దీంతో ప్రభుత్వానికి ఈసారి భారీగానే ఆదాయం వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది.

దరఖాస్తుల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత.. అక్టోబర్‌ 23న కొత్త మద్యం షాపుల కేటాయింపునకు డ్రా తీస్తారు. డ్రా లో దుకాణాల లైసెన్స్ పొందిన వారు మొదటి విడత చెల్లింపు మొత్తాన్ని అక్టోబర్ ...