భారతదేశం, సెప్టెంబర్ 11 -- తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీ సర్టిఫికెట్లు పొందడం ఇప్పుడు మీసేవా కేంద్రాల ద్వారా చాలా వేగంగా, సులభంగా మారిందని తెలంగాణ ఐటీ మంత్రి డి శ్రీధర్ బాబు వెల్లడించారు. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు సమర్పించిన నిమిషంలోపే పత్రాలు జారీ అవుతాయన్నారు. కుల ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి 15 రోజుల కిందట కొత్త విధానాన్ని తీసుకొచ్చామని మంత్రి తెలిపారు.

కొత్త విధానంతో ఇప్పటికే 17,500 మందికి పైగా పౌరులకు ప్రయోజనం చేకూరిందని శ్రీధర్ బాబు అన్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 20 లక్షల మంది దరఖాస్తుదారులకు ఇది సులభతరం చేస్తుందని మంత్రి నొక్కి చెప్పారు. ఇందులో మరో ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించారు. కుల ధ్రువీకరణ పత్రం తీసుకునేటప్పుడు ప్రతీసారి ఆమోద ప్రక్రియకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు మంత్రి. కొత్తగా జారీ చేసే కుల ధ్రువీకరణ పత్రంలో మె...