భారతదేశం, డిసెంబర్ 23 -- తెలంగాణలో ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు అయిందనే వార్త వైరల్ అయింది. దీనిపై క్లారిటీ వచ్చింది. 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం ప్రతీ పంచాయతీలోనూ ప్రత్యేక ఖాతా తెరవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ నిధుల చెల్లింపుల గురించి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శలు డిజిటల్ సంతకాలు తప్పనిసరి. అయితే ఇందులో ఉప సర్పంచ్ పేరు ప్రస్తావన లేదు. దీనితో అంతా ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు అయిందని ప్రచారం చేశారు.

కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇది ఈ కేంద్ర నిధుల నిర్వహణకు సంబంధించిన సాంకేతిక మార్పు. గ్రామ పంచాయతీ సాధారణ నిధుల వినియోగంలో ఉప సర్పంచ్‌లకు ఉండే పాత అధికారులు ప్రస్తుతానికి అలాగే ఉండే అవకాశం ఉంది.

కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి.. గ్రామ పంచాయతీలో ప్రత్యేక ఖాతాకు పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌ సంతకాలు ఉండ...