Telangana,hyderabad, జూలై 30 -- రాష్ట్రంలో అన్ని రకాల జూనియర్‌ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మొదటి విడత అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం రెండో విడత ప్రవేశాలు జరుగుతున్నాయి. అయితే ఈ గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. టెన్త్ పాస్ అయిన విద్యార్థులు రేపటిలోపు అడ్మిషన్ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఈ విద్యా సంవత్సరానికి సంంబధించిన తొలి విడత ప్రవేశాలు మే 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ గడువు జూన్ 30వ తేదీతోనే ముగిసింది.ఆ తర్వాత రెండో విడత ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రస్తుతం అర్హులైన విద్యార్థులు అప్లయ్ చేసుకుంటున్నారు. అయితే జూలై 31వ తేదీతో ఈ గడువు కూడా పూర్తవుతుంది.కాబట్టి అర్హులైన విద్యార్థులు. వెంటనే అడ్మిషన్ తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఆ తర్...