Telangana, జూలై 24 -- తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన వారం రోజులుగా పలు ప్రాంతాల్లో భారీస్థాయిలో వర్షాలు పడుతున్నాయి. మరో మూడు నాలుగు రోజులు కూడా ఇదే పరిస్థితులు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలను జారీ చేసింది.

తెలంగాణలో ఇవాళ పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని ఐఎండీ అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆదిలాబాద్, ఆసిఫిబాద్, మంచిర్యాల, కొత్తగూడెం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చు. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ...