Hyderabad, జూలై 21 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లీడ్ రోల్లో నటించిన హరి హర వీరమల్లు మూవీ టికెట్ల ధరలు తెలంగాణలో పెరిగాయి. సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ లలో ధరలు పెంపు ఒక్కోలా ఉంది. ఇక స్పెషల్ ప్రీమియర్ షోలకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒక రోజు ముందే ఈ షోలు ఉండనున్నాయి.

హరి హర వీరమల్లు మూవీ టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ సోమవారం (జులై 21) తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంతేకాదు జులై 23 రాత్రి 9 గంటలకు ఓ స్పెషల్ షోకి కూడా అనుమతి ఇచ్చింది. ఈ షోకి టికెట్ల ధరను రూ.600గా నిర్ణయించారు.

ఇక తొలి నాలుగు రోజుల పాటు ఒకలా, తర్వాత 6 రోజుల పాటు మరోలా టికెట్ల ధరల పెంపు ఉండనుంది. తొలి నాలుగు రోజులు సింగిల్ స్క్రీన్లలో టికెట్ పై రూ.150, మల్టీప్లెక్స్ లలో రూ.200 పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. దీంతో సింగిల్ స్క్రీన్లలో ధరలు రూ.354 వరకు...