భారతదేశం, డిసెంబర్ 29 -- తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ(TGDPS) డేటా ప్రకారం మొత్తం 11 జిల్లాల్లో ఆదివారం, సోమవారం (డిసెంబర్ 28, 29) ఉదయం మధ్య 10 డిగ్రీలు లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణిలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 6.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

దీని తర్వాత కోహీర్ (సంగారెడ్డి), భీంపూర్ (ఆదిలాబాద్)లో 7.5డిగ్రీలు, మొయినాబాద్ (రంగారెడ్డి)లో 8.2 డిగ్రీలు, యెల్దుర్తి (మెదక్‌లో) 8.4 డిగ్రీలు, మోమిన్‌పేట (వికారాబాద్‌)లో 8.5 డిగ్రీలు, పెంబి (నిర్మల్‌)లో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గంభీరావుపేట (రాజన్న సిరిసిల్ల)లో 9.7 డిగ్రీలు, అక్బర్‌పేట(సిద్దిపేట), ఉప్పల్‌లో (మేడ్చల్‌ మల్కాజిగిరి) 9.8 డిగ్రీలు, సాలూరా (నిజామాబాద్‌), రామగిరి (పెద్దపల్లి)లో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి....