Telangana,khammam, మే 30 -- భూభారతి లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించనున్నారు. జూన్ 20 వరకు అన్ని రెవెన్యూ గ్రామాలలో తహసిల్దార్ల ఆధ్వర్యంలో ఈ సదస్సులను జరుపుతామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ సదస్సుల్లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు సూచించారు.

గురువారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లోని పలువురు మంత్రులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూ భారతి, ఇందిరమ్మ ఇండ్లతో పాటు పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పొంగులేటి.. అసైన్డ్ భూముల పట్టాలపై కీలక ప్రకటన చేశారు.

అసైన్డ్ భూములలోసాగు చేసుకుంటున్న నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందని పొంగులేటి చెప్పారు. అంతేకాకుండా.. సాదా బైనామా సంబంధించి ...