భారతదేశం, మే 18 -- మందుబాబులకు తెలంగాణ సర్కార్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల బీర్ల ధరలు పెంచిన ప్రభుత్వం...తాజాగా మద్యం రేట్లను కూడా పెంచింది. లిక్కర్ పై సెస్ ను ఎక్సైజ్ శాఖ సవరించింది. స్పెషల్ ఎక్సైజ్ సెస్ ను పునరుద్ధరించింది.

2020లో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ స్పెషల్ ఎక్సైజ్ సెస్ ను విధించింది. వివిధ కారణాలతో 2023లో దీనిని తొలగించింది. తాజాగా ఇప్పుడు మళ్లీ స్పెషల్ ఎక్సైజ్ సెస్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

అలాగే పలు రకాల మద్యం బాటిల్స్ పై సెస్ పెంచింది. బీర్లు, ఛీప్ లిక్కర్ ,బ్రీజర్ లాంటి డ్రింక్ పై ప్రత్యేక సెస్ ను సవరించలేదు. వీటిపై పాత పన్నులు యథావిధిగా ఉంటాయని తెలంగాణ ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.

తెలంగాణలో మద్యం ధరలు పెంచుతున్నట్లు ఇప్పటికే వైన్ షాపులకు ఎక్సైజ్ శాఖ సర్క్యులర్లు జారీ చేసింది. 180 ఎం.ఎల్ బాటిల్ పై రూ.10, ఆఫ...