భారతదేశం, అక్టోబర్ 30 -- ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి తీరం దాటిన మెుంథా తుపాను ప్రభావం కారణంగా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా బుధవారం చాలా ప్రాంతాల్లో గ్యాప్ లేకుండా వాన పడుతూనే ఉంది. బుధవారం సాయంత్రం వరకూ వర్షం పడుతూనే ఉంది. దీంతో వాగులు వంకల్లో భారీగా వరద నీటి ప్రవాహం కనిపించింది. ఇక పలు జిల్లాల్లో కుండపోత వాన పడింది.

తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం, హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లెలో ఉదయం 8:30 నుండి రాత్రి 9 గంటల మధ్య అత్యధికంగా 41.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. తరువాత వరంగల్ జిల్లాలోని కల్లెడ 34.8 సెం.మీ, రెడ్లవాడ 333.3 మి.మీ వర్షపాతం నమోదైంది.

భారత వాతావరణ శాఖ వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు బుధవారం రాత్రి నుంచి రెడ్ అలర్ట్ జా...