భారతదేశం, డిసెంబర్ 7 -- ఏపీ , తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉదయం, రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతున్నాయి. రోజురోజుకూ పరిస్థితి మరింత చల్లగా మారుతోంది. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

మరోవైపు రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో చలి మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సాధారణం కంటే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని అంచనా వేసింది.ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

ఇవాళ ఆదిలాబాద్‌లో 9.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా. మెదక్‌లో 11.3 డిగ్రీలు, హనుమకొండలో 13.5 డిగ్రీలు, రామగుండంలో 14.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరోవైపు ఏపీలోనూ చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోన...