భారతదేశం, డిసెంబర్ 11 -- చలి తీవ్రతకు తెలంగాణ పల్లెలు వణికిపోతున్నాయి. పట్నం, పల్లె అనే తేడా లేకుండా. ఎక్కడైనా చలి పంజా విసురుతోంది. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో. ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం పొగమంచు పరిస్థితులు ఉంటే.సాయంత్రం 5 దాటితే ఇంట్లో నుంచి బయటికి రావాలంటే జంకుతున్నారు.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ ప్రకారం.రాబోయే 2-3 రోజుల్లో తెలంగాణని పలుచోట్ల అక్కడక్కడ కనిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల నుంచి 4 డిగ్రీల వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగాం, సిద్ధిపేట,సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలి గాలులు వీచే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

డిసెంబర్ 13వ తేదీన ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్,...