భారతదేశం, మే 24 -- 2047 నాటికి భారతదేశాన్ని సూపర్ పవర్‌గా, నెంబర్ వన్‌గా నిలబెట్టాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పాన్ని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. వికసిత భారత్ ప్రణాళికను రూపొందించడం అభినందనీయమన్నారు. పహల్గాంలో మారణకాండ సృష్టించిన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించినందుకు.. మోదీకి, భారత సైన్యానికి అభినందనలు చెప్పారు. 1971లో ఇందిరాగాంధీ నాయకత్వంలో పాకిస్థాన్‌ను ఓడించి, ఆ దేశాన్ని రెండు ముక్కలుగా చీల్చిన చరిత్రను గుర్తుచేశారు.

'తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళిక సిద్ధమైంది. ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్​-2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించాం. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన...