భారతదేశం, నవంబర్ 20 -- తెలంగాణకు వాతావరణశాఖ వర్ష సూచన ఇచ్చింది. ఈనెల 23వ తేదీ నుంచి వర్షాలు ఉంటాయని పేర్కొంది. పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చని తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాలను పేర్కొంది.

నవంబర్ 21,22 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుంది. చలి తీవ్రత కూడా కొనసాగుతుందని అంచనా వేసింది. 23వ తేదీ నుంచి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడుతాయని పేర్కొంది. ఈనెల 25వ తేదీ వరకు వానలు కురుస్తాయని వెల్లడించింది. ఈనెల 26వ తేదీ నుంచి తిరిగి పొడి వాతావరణమే ఉంటుందని అంచనా వేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.

హైదరాబాద్ లో చూస్తే రాత్రి వేళల్లో పొగమంచుతో కూడిన పరిస్థితులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 2 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 3 డ...