భారతదేశం, ఏప్రిల్ 27 -- బీఆర్ఎస్ పాలనలో పదేళ్ల పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపామని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. ప‌దేండ్లలో తెలంగాణ‌ను ద‌గ‌ద‌గ‌లాడే విధంగా నిర్మించుకున్నామ‌న్నారు. వ‌రంగ‌ల్ ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ర‌జ‌తోత్సవ స‌భ‌లో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణకు కాంగ్రెస్ ఫస్ట్ విలన్ అని విమర్శించారు.

ఆనాడు, ఈనాడు తెలంగాణకు కాంగ్రెస్సే మొదటి విలన్ అని కేసీఆర్ విమర్శించారు. 1956లో తెలంగాణను ఆంధ్రలో కలిపింది జవహర్ లాల్ నెహ్రూ అని అన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ నిరంకుశంగా అణచివేసిందని మండిపడ్డారు. 1969లో మూగ‌బోయిన తెలంగాణ నినాదానికి గులాజీ జెండా తిరిగి జోవం పోసిందన్నారు. తెలంగాణ ఇస్తామని ప్రకటన చేసి ఆంధ్రలో వ్యతిరేక ఉద్యమం ప్రారంభం కావడంతో వెనక్కి తగ్గారని ఫైర్ అయ్యారు.

"ఈ సభను కూడా కొంద‌ర...