భారతదేశం, జనవరి 22 -- తెలంగాణకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికులకు సేవలందించనుంది. 23 జనవరి 2026న దేశవ్యాప్తంగా నాలుగు అమృత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేరళలోని తిరువనంతపురం నుంచి ఈ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు.

తిరువనంతపురం నుంచి చర్లపల్లి వరకు ఈ అమృత భారత్ రైలు నడవనుంది. ఇప్పటికే చర్లపల్లి-ముజఫర్ పూర్ (బిహార్) మధ్య ఒక అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలందిస్తుండగా.. ఇది తెలంగాణ రాష్ట్రానికి ఇది రెండోది. ఎక్కువదూరం ప్రయాణించే రైలు రూట్లలో.. ప్రయాణికులకు మరింత సులభతరమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించే దిశగా ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతను చాటుకుంటోంది.

ఈ రైలు ప్రతి మంగళవారం 17041 నెంబరుతో ఈ నడిచే రైలు ఉదయం చర్లపల్లి నుంచి ఉదయం 7.15కు బయలుదేరి.. మరుసటి రోజు (బుధవారం) మధ్యాహ్నం 2.45కు తిరువనంతపురం చేర...