భారతదేశం, డిసెంబర్ 9 -- తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు ఈ సమ్మిట్‌కు హాజరు అయ్యారు. ప్రభుత్వం అనుకున్నట్టుగానే భారీగా పెట్టుబడులు, అవగాహన ఒప్పందాలు ఈ సమ్మిట్‌‌లో జరిగాయి.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ఎంఓయూలు, పెట్టుబడులు మెుత్తం కలిపి రూ.5,39,495కు చేరుకున్నాయి. డిసెంబర్ 8వ తేదీన రూ.2,43,000 కోట్లు, డిసెంబర్ 9వ తేదీన రూ.2,96,495 కోట్లు పెట్టుబడులు, ఎంవోయూలు జరిగాయి. మెుత్తం 5 లక్షల కోట్లకుపైగా చేరుకుంది. ఇందులో పరిశ్రమలు, ఐటీ, పవర్, స్పోర్ట్స్, టూరిజం ఫారెస్ట్‌తోపాటుగా ఇతర రంగాలు కూడా ఉన్నాయి.

ప్రముఖ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించాయి. ఎంవోయూలు చేసుకున్నాయి. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల...