భారతదేశం, జూన్ 25 -- తెలంగాణకు చెందిన రాకేష్ ఆర్నె మిస్టర్ ఇండియా 2025 టైటిల్‌ను సాధించారు. ఈయన మహబూబ్‌నగర్ జిల్లా నవపేట మండలం ధర్పల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. గోవాలోని గోల్డెన్ క్రౌన్ రిసార్ట్స్‌లో జూన్ 19న జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. తాజాగా బషీర్‌బాగ్ ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో రాకేష్ మాట్లాడారు. తన జీవితం గురించి పలు విషయాలను వెల్లడించారు. త్వరలోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్టు ప్రకటించారు.

'మిస్టర్ ఇండియా 2025 టైటిల్ నా కఠోర శ్రమ, కుటుంబం, మిత్రుల మద్దతు ఇందులో ఎక్కువగా ఉంది. ఫిట్‌నెస్, ఆత్మవిశ్వాసం, సామాజిక అవగాహనతో ఈ పోటీలకు రెడీ అయ్యాను. నా నెక్ట్స్ టార్గెట్ ఇండోనేషియాలో జరిగే మిస్టర్ వరల్డ్ గ్లోబల్ 2025 పోటీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం.' అని రాకేష్ చెప్పారు. ...