Telangana,hyderabad, జూలై 25 -- వాయువ్య బంగాళాఖాతంలో మరియు దానికి అనుకుని ఉన్న బెంగాల్ తీ ప్రాంతాలు, బంగ్లాదేశ్ ప్రాంతాల్లో వాయుగుండం ఏర్పడింది. గడిచిన 3 గంటల్లో 13 కి.మీ వేగంతో పశ్చిమ - వాయువ్వ దిశగా కదిలి తీరాలను దాటినట్లు ఐఎండీ పేర్కొంది. మరోవైపు ఉత్తర ప్రదేశ్, ఈశాన్య మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్ ఘడ్, దక్షిణ జార్ఖండ్, ఉత్తర ఒడిశా మీదుగా వాయుగుండం కేంద్రం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిమీ ఎత్తు వరకు ద్రోణి కొనసాగుతోందని వివరించింది. ఈ ప్రభావంతో మరికొన్ని రోజులు పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఇవాళ రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానల...