Telangana,andhrapradesh, జూన్ 1 -- నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. అయితే భారీ వర్షాలు కాకుండా. ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం(జూన్ 0) ఉదయం బులెటిన్ ప్రకారం..ఇవాళ పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడుతాయి. ఇక నిర్మల్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, కామారెడ్డి, మహబబ్ నగర్ ,నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

రేపు(జూన్ 02) భూపాలపల్లి, మ...