Telangana,hyderabad, సెప్టెంబర్ 10 -- తెలంగాణలో మళ్లీ వర్షాలు పడనున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరో 4 రోజులపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో బలమైన ఉపరితల గాలులు వీచే సూచనలున్నాయి. కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం... ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే సూచనలున్నాయి. కొన్ని చోట్ల బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశాలున్నాయి.

రేపు (సెప్టెంబర్ 11) ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, మ...