భారతదేశం, నవంబర్ 27 -- నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని వాతావరణశాఖ తెలిపింది. ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ, రాబోయే 12 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది.

ఆ తర్వాత తదుపరి 48 గంటల్లో (నవంబర్ 29వ తేదీ సాయంత్రం లేదా 30వ తేదీ ఉదయం నాటికి) నైరుతి బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానికి ఆనుకుని ఉన్న దక్షిణకోస్తా తీరం వైపు కదులుతూ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఏపీ మాత్రమే కాకుండా తెలంగాణలోనూ వర్షాలు పడే అవకాశం ఉంది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం..నవంబర్ 29వ తేదీ నుంచి రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు పలు జిల్...