Telangana,hyderabsd, ఆగస్టు 15 -- పశ్చిమమధ్య,ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని ఉన్న అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో తెలంగాణలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం... ఇవాళ ఆదిలాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.

కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాస, జనగాం, కరీంనగర్, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

రేపు(ఆగస్ట్ 16) ఆదిలాబాద్,...