భారతదేశం, డిసెంబర్ 29 -- ఫర్హాన్ అఖ్తర్ నటించిన, 1962 ఇండో-చైనా యుద్ధం నాటి నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో రూపొందిన '120 బహదూర్' సినిమా ఓటీటీలోకి రాబోతుంది. థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇందులో రాశీ ఖన్నా హీరోయిన్.

ఓటీటీలో వాస్తవ సంఘటనల స్ఫూర్తితో వచ్చిన సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఇండో-చైనా యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన 120 బహదూర్ కూడా అలాంటి సినిమానే ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. నివేదికల ప్రకారం ఈ సినిమా జనవరి 16, 2026న ఓటీటీలో రిలీజ్ కానుంది.

నివేదికల ప్రకారం '120 బహదూర్' జనవరి 16, 2026 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవ్వడం ప్రారంభించనుంది. ఈ సినిమా నవంబర్ 21, 2025న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు సుమారు రెండు నె...