భారతదేశం, డిసెంబర్ 30 -- 2025 ముగింపు దశకు వచ్చేసింది. 2026లోకి అడుగు పెట్టబోతున్నాము. కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని, అన్నీ కలిసి రావాలని అనుకుంటారు. 2026లో తులా రాశి వారికి ఎలా ఉంటుంది? ఆర్థికపరంగా, ఉద్యోగ పరంగా ఎలా ఉంటుంది? ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు వస్తాయి? వంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

2026లో జనవరి నుంచి ఏప్రిల్ వరకు చూస్తే మనోధైర్యం, మానసిక బలం పెరుగుతాయి. వ్యక్తిత్వం మెరుగు పడుతుంది. ఆరోగ్యం మెరుగుప డుతుంది. ఆలోచనల్లో పురోగతి ఉంటుంది. మానసిక బలంతో మీరు పనుల్లో పురోగతి సాధిస్తారు. కొత్త ఆలోచనలు జీవిత అభివృద్ధికి బలాన్ని అందిస్తాయి.

2026 సానుకూల సంవత్సరం. సూర్యుని ప్రభావం వల్ల ఆర్థిక పురోగతి ఉంటుంది. మీరు ఖర్చు చేసే దాని కంటే ఎక్కువ సంపాదిస్తారు. కుటుంబ పని పట్ల మనస్సు ఉత్సాహంగా ఉంటుంది. స్పీచ్, బిజిన...