Hyderabad, జూలై 5 -- జూలై 4 నుంచి జూలై 6 వరకు చంద్రుడు తులా రాశిలో ఉంటాడు. నిన్న ఉదయం 3:18కి తులా రాశిలోకి చంద్రుడు ప్రవేశించాడు. రెండు రోజులు పాటు, అంటే జూలై 6 సాయంత్రం నాలుగు గంటల వరకు తులా రాశిలోనే ఉంటాడు. ఇది కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను ఇస్తుంది.

తులా రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు ప్రేమ, అందం, విలాసాలను అందిస్తాడు. శుక్రుడి రాశిలోకి చంద్రుడు ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి ఇది కలిసి వస్తుంది. మరి ఏ రాశుల వారికి తులా రాశిలో చంద్రుని ప్రవేశం శుభప్రదంగా ఉంటుంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

చంద్రుడు మార్పు కూడా చాలా ముఖ్యమైనది. చంద్రుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు కొన్ని శుభయోగాలు ఏర్పడతాయి. ఇది కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది, అనేక ప్రయోజనాలను కల్పిస్తుంది. సంతోషం...