భారతదేశం, అక్టోబర్ 30 -- తులసి వాస్తు చిట్కాలు: సనాతన ధర్మంలో, తులసి మొక్క (Tulasi Plant) చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దీన్ని ఇంట్లో పెట్టినప్పుడు కొన్ని నియమాలను పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని తప్పులు చేయకుండా చూసుకోవాలి. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు శాస్త్రంలో తులసి మొక్క విషయంలో పాటించాల్సిన నియమాల గురించి కూడా చెప్పడం జరిగింది.

ఇంట్లో తులసి ఉంటే లక్ష్మీదేవి (Goddess Lakshmi) అనుగ్రహం ఉన్నట్టే. తులసి మొక్కను ఇంట్లో పెట్టేటప్పుడు దానిని సరైన దిశలో ఉంచడం చాలా అవసరం. అదే సమయంలో ఈ మొక్క చుట్టూ ఏయే వస్తువులు ఉంచకూడదో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా సార్లు, తెలిసి లేదా తెలియకుండా, తులసి మొక్కకు దగ్గరల్లో ఇలాంటి అనేక వస్తువులను ఉంచుతాం, దీని వల్ల వాస్...