భారతదేశం, నవంబర్ 22 -- నైజీరియాలో మరోసారి సామూహిక కిడ్నాప్‌ల కలకలం రేగింది. దేశంలోనే అతిపెద్ద సామూహిక కిడ్నాప్‌లలో ఒకటిగా దీన్ని భావిస్తున్నారు. భద్రతా పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్న వేళ, మధ్య నైజీరియాలోని నైగర్ రాష్ట్రంలో శుక్రవారం తుపాకీలతో వచ్చిన దుండగులు ఏకంగా 300 మందికి పైగా పాఠశాల విద్యార్థులను అపహరించారు.

సెంట్రల్ నైజీరియాలోని నైగర్ రాష్ట్రంలో ఉన్న సెయింట్ మేరీస్ కో-ఎడ్యుకేషన్ స్కూల్‌లో ఈ దారుణం జరిగింది. మొదట్లో 227 మంది విద్యార్థులను కిడ్నాప్ చేసినట్లుగా అంచనా వేశారు. అయితే, ఈ కిడ్నాప్‌పై క్రిస్టియన్ అసోసియేషన్ ఆఫ్ నైజీరియా (CAN) శనివారం వివరాలను విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం, క్యాథలిక్ పాఠశాల నుంచి అపహరణకు గురైన విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య 315కు పెరిగింది.

"తప్పించుకోవడానికి ప్రయత్నించిన అదనంగా 88 మంది విద్యార్థులను కూడ...