Hyderabad, మే 30 -- మలయాళం రివేంజ్ థ్రిల్లర్ మూవీ తుడరుమ్ (Thudarum) శుక్రవారమే (మే 30) జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. థియేటర్ల కంటే కూడా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ అయిన తర్వాతే ఈ సినిమాకు ఎక్కువ పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. మరి మీకు కూడా ఈ సినిమా నచ్చితే.. ఇలాంటివే ఓటీటీలో చూడాల్సిన మలయాళం రివేంజ్ థ్రిల్లర్ సినిమాలేవో తెలుసుకోండి.

మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన అసలుసిసలు రివేంజ్ థ్రిల్లర్ మూవీ పని (Pani). ప్రముఖ నటుడు జోజు జార్జ్ డైరెక్ట్ చేసి లీడ్ రోల్లో నటించిన సినిమా ఇది. త్రిసూర్ లోని పేరుగాంచిన ఫ్యామిలీల్లో ఒకటైన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని ఇద్దరు కుర్రాళ్లు సృష్టించే విధ్వంసం.. దానికి హీరో తీసుకునే ప్రతీకారం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

టొవినో థామస్, త్ర...