Hyderabad, మే 27 -- తుడరుం (Thudarum).. ఈ మలయాళ మూవీ టైటిల్ కు అర్థమేంటో తెలుసా? ఇంకా కొనసాగుతుంది అని అర్థం. టైటిల్ మార్చకుండా తెలుగులోనూ అలాగే రిలీజ్ చేస్తున్నందుకు దీనిపై మొదట్లో విమర్శలు వెల్లువెత్తినా.. తర్వాత ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ.. గురువారం (మే 29) నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ కాబోతోంది.

మలయాళం థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంటుంది. అక్కడి ఫిల్మ్ మేకర్స్ ఈ జానర్లలో సినిమాలు తీయడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. తాజాగా వచ్చిన తుడరుం కూడా అలాంటిదే. ఈ సినిమాను ఓటీటీలో చూడటానికి 5 కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.

అసలు ఈ తుడరుం మూవీ స్టోరీయే చాలా థ్రిల్లింగా అనిపిస్తుంది. తన భార్య, ఇద్దరు పిల్లలు, తనకెంతో ఇ...