భారతదేశం, అక్టోబర్ 26 -- బాలీవుడ్ సీనియర్ కమెడియన్ సతీష్ షా మరణించిన సంగతి తెలిసిందే. శనివారం (అక్టోబర్ 25) ఆయన కన్నుమూశారు. ఆయన మరణ వార్త బాలీవుడ్ లో తీవ్ర విషాదాన్ని నింపింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, హృతిక్ రోషన్, అనుపమ్ ఖేర్, ఆర్ మాధవన్ వంటి పలువురు ప్రముఖులు దిగ్గజ నటుడు సతీష్ షా మృతి పట్ల సంతాపం తెలిపారు. నివేదికల ప్రకారం సతీష్ షా 74 ఏళ్ల వయసులో శనివారం సెప్టిక్ షాక్ కారణంగా మరణించారు.

"మరో రోజు, మరో పని, మరో నిశ్శబ్దం. మాలో మరొకరు వెళ్లిపోయారు. సతీష్ షా.. ఒక యువ ప్రతిభావంతుడు. చాలా చిన్న వయసులోనే మనల్ని విడిచిపెట్టారు. నక్షత్రాలు మనందరినీ కరుణించడం లేదు. ఈ విషాద సమయాల్లో సాధారణంగా భావాలను వ్యక్తం చేయడం సరికాదు. ప్రతి క్షణం మనందరిలో ఒక అశుభ సూచనను రేకెత్తిస్తోంది" అని అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో పోస్ట...