భారతదేశం, అక్టోబర్ 28 -- మెుంథా తీవ్ర తుపానుగా బలపడింది. ఆంధ్రప్రదేశ్‌ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. తీవ్ర తుపాను మారిన మెుంథా ఏపీ వైపు దూసుకువస్తోంది. దీంతో పరిస్థితులు గంటగంటకు మారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షం జోరుగా కురుస్తోంది. ఈదురుగాలులు వీస్తున్నాయి. గడిచిన ఆరు గంటలుగా గంటకు 15 కిలో మీటర్లు వేగంతో ఉత్తర వాయువ్య దిశగా తుపాను కదిలిందన విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం నాడు 18 గంటలపాటు తుపాను ఎఫెక్ట్ కనిపించనుంది.

మంగళవారం సాయంత్రం లేదా రాత్రి నాటికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీవ్ర తుపాను తీరం దాటనుంది. ఈ సమయంలో తుపాను బీభత్సం మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని చాలా జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ ఇప్పటికే హెచ్చరించింది. ...