భారతదేశం, అక్టోబర్ 28 -- మొంథా తుపాను తీరాన్ని తాకింది. కాకినాడ- మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో తుపాన్ కదిలినట్లు ఐఎండీ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. పూర్తిగా తీరం దాటడానికి 3-4 గంటల సమయం పట్టొచ్చని అంచనా వేసింది.

కోస్తా వెంబడి గంటకు 90-100 కిమీ వేగంతో ఈదురగాలులు వీస్తున్నాయని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలు సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

బుధవారం(అక్టోబర్ 29) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు పడొచ్చు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు పడుతాయి. ఇక కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస...