భారతదేశం, ఆగస్టు 1 -- అమెరికా తూర్పు తీరంలో గురువారం కుండపోత వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం, వరదల కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇటు ఫిలడెల్ఫియా నుంచి అటు న్యూయార్క్ నగరాల వరకూ ప్రధాన రహదారులపై వరద నీరు పోటెత్తడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం కారణంగా ఈ ప్రాంతంలో విమానాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. చాలా చోట్ల లోతైన నీటిలో చిక్కుకుపోయిన వాహనదారులను రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.

న్యూయార్క్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రధాన రహదారులన్నీ కొద్దిసేపు మూసుకుపోయాయి. సాయంకాలం రద్దీ వేళ కావడంతో రైల్వే స్టేషన్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. వరద నీరు రైళ్లలోకి కూడా చేరింది. మాన్‌హట్టన్‌లోని గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న రైలులోకి వర్షపు నీరు ధారగా కురుస్తున్న వీడియోలు స...