భారతదేశం, అక్టోబర్ 29 -- అమరావతి, అక్టోబర్ 29: 'మొంథా' తుపాను తీవ్ర తుపానుగా మారి మంగళవారం రాత్రి నర్సాపూర్ వద్ద తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ (IMD) అధికారికంగా ప్రకటించింది.

తీవ్ర తుఫానుగా ఉన్న 'మొంథా' క్రమంగా తెల్లవారుజాము వరకు బలహీనపడి సాధారణ తుపానుగా మారింది.. తుపాను తీరం దాటే ప్రక్రియ కాకినాడ పరిసర ప్రాంతాల్లో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య ప్రారంభమైంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురిశాయి. పలు చోట్ల ఈదురు గాలుల కారణంగా చెట్లు విరిగిపడ్డాయి. అధికారులు నష్టాలు అంచనా వేస్తున్నారు.

'మొంథా' తీవ్ర తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల్లో కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

తెలంగాణలోని శంషాబాద్ (Shamshabad) నుండి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి విమానాశ్రయాల మధ్య నడిచే 35 విమాన సర్వీసు...