Andhrapradesh, అక్టోబర్ 3 -- తీవ్ర వాయుగుండం తీరం దాటింది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడుతోంది. తీరం దాటినప్పటికీ... కోస్తా జిల్లాలపై వాయుగుండం ప్రభావం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో ఇవాళ ఉత్తర కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

ఇవాళ ఉత్తరాంధ్రలో పలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.శ్రీకాకుళం,విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ,అనకాపల్లి, కాకినాడ, కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.

ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాల దాటికి వంశధార నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. గొట్టా బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ అయింది. ...