Andhrapradesh, సెప్టెంబర్ 27 -- వాయువ్య మరియు దానికి ఆనుకుని ఉన్న మధ్యబంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం. వాయుగుండంగా మారింది. పశ్చిమ వాయువ్య దిశగా కదిలి వాయువ్య మరియు దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల వద్ద వాయుగుండంగా బలపడిందని ఐఎండీ తెలిపింది.

ఈ వాయుగుండం దాదాపు పశ్చిమం వైపు కదులుతూ ఇవాళ(సెప్టెంబర్ 27) ఉదయం గోపాల్‌పూర్‌కు దగ్గరగా దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఇవాళ కొన్నిప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని సూచించింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింద...