భారతదేశం, అక్టోబర్ 12 -- తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో నకిలీ కరెన్సీ రాకెట్ ను పోలీసులు ఛేదించారు. 12 మంది సభ్యులతో కూడిన అంతర్రాష్ట్ర ముఠా దందాను గుట్టురట్టు చేశారు. ప్రస్తుతం 8 మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర వెల్లడించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను బీహార్, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో అరెస్టు చేసినట్లు ప్రకటించారు.

కామారెడ్డిలోని ఓ మద్యం దుకాణంలోని క్యాషియర్ సెప్టెంబర్ 24వ తేదీన ఓ కస్టమర్ రూ. 500 నోట్లు ఇచ్చాడు. అయితే ఇవి నకిలీవిగా ఉన్నట్లు అనుమనించిన క్యాషియర్. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సీన్ లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దర్యాప్తు ప్రారంభించి. సెప్టెంబర్ 24వ తేదీన నోట్లు ఇచ్చిన సిద్దాగౌడ్‌ అనే వ్యక్తిని గుర్తించారు.

తమదైన శైలిలో పోలీసులు విచారించటంతో. సిద్ధాగౌడ్ అసలు విషయాలను బయటపెట్...