భారతదేశం, మే 6 -- ఓ వైపు సినిమా షూటింగ్ లో బిజీగా ఉండే విజయ్ దేవరకొండ.. మరోవైపు ఐపీఎల్ 2025లో మ్యాచ్ లతో తీరిక లేకుండా ఉన్న తిలక్ వర్మ. కానీ ఈ ఇద్దరూ కలిశారు. సరదాగా పికిల్ బాల్ గేమ్ ఆడారు. ఈ ఇద్దరు హైదరాబాదీలు నువ్వానేనా అన్నట్లుగా పికిల్ బాల్ గేమ్ లో పోటీపడ్డారు. చివరకు రౌడీ హీరో విజయ్ గెలిచారు.

విజయ్ దేవరకొండ, తిలక్ వర్మ ఆడిన పికిల్ గేమ్ వీడియోను ముంబయి ఇండియన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది. విజయ్, తిలక్ విక్టరీ కోసం చెమటోడ్చడం ఈ వీడియోలో కనిపించింది. సరదాగా మొదలైన పోరు ఆ తర్వాత రసవత్తరంగా మారింది. తిలక్ గెలిస్తే తాను ముంబయి ఇండియన్స్ జెర్సీ ఇప్పుడే వేసుకుంటానని విజయ్ ఛాలెంజ్ చేశారు.

ఉత్కంఠగా సాగిన పికిల్ బాల్ పోరులో చివరకు విజయ్ దేవరకొండ గెలిచారు. బెస్ట్ ఆఫ్ త్రీ గేమ్స్ మ్యాచ్ ను 2-1తో గెలుచుకున...