భారతదేశం, ఏప్రిల్ 28 -- తిరుమల శ్రీవారి సేవ నాణ్యతను మెరుగుపరిచి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ అధికారులు శ్రీ సత్యసాయి సేవా సంస్థ (పుట్టపర్తి), ఇషా ఫౌండేషన్ (కోయంబత్తూర్), ఆర్ట్ ఆఫ్ లివింగ్ (బెంగళూరు) వంటి ప్రఖ్యాత సంస్థలను సందర్శించి అధ్యయనం చేశారు.

ఈ అధ్యయనం ఆధారంగా శ్రీవారి సేవలో కొన్ని ముఖ్యమైన మార్పులను టీటీడీ తీసుకొచ్చింది. ఈ మార్పులు ఏప్రిల్ 30న కొత్తగా రూపొందించిన అప్లికేషన్ ద్వారా అమలులోకి రానున్నాయి.

శ్రీవారి స్వచ్చంద సేవ జూన్ నెల ఆన్‌లైన్ కోటాను ఏప్రిల్ 30న టీటీడీ విడుదల చేయనుంది.

- జనరల్ శ్రీవారి సేవ (తిరుమల, తిరుపతి) - ఉదయం 11:00 గంటలకు

- నవనీత సేవ (మహిళలకు మాత్రమే) - మధ్యాహ్నం 12:00 గంటలకు

- పరకామణి సేవ (పురుషులకు మాత్రమే) - మధ్యాహ్నం 1:00 గంటలకు

- గ్రూప్ లీడర్ ...