భారతదేశం, మే 1 -- తిరుమలలో శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శన వేళల మార్పు అమల్లోకి వచ్చింది. గురువారం నుంచి బ్రేక్‌ దర్శన సమయంలో మార్పు అమల్లోకి వస్తుంది. గతంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు ఉదయం 5.30కు మొదలై ఉదయం 11 గంటల వరకు కొనసాగేవి. దీంతో ఆ సమయంలో మిగిలిన భక్తులకు ఎదురు చూపులు తప్పేవి కాదు. వైసీపీ హయాంలోని టీటీడీ బోర్డు వీఐపీ బ్రేక్‌ దర్శనాలను ఉదయం 10 గంటలకు మార్చింది.

తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శన వేళల్లో చేసిన మార్పు గురువారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చింది. గతంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు ఉదయం 5.30 గంటలకు మొదలై ఉదయం 11 గంటలకు ముగిసేవి.

వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి పాలక మండలి వీఐపీ బ్రేక్‌ దర్శనాలను ఉదయం 10 గంటలకు మార్చారు. ఆ తర్వాత కూడా జనరల్‌ బ్రేక్‌ దర్శన భక్తులకు మాత్రం ఉదయం 8 నుంచి 10 గంటల్లోపు.. ఆ తర్వాత ప్రొటోకాల్‌, రె...