భారతదేశం, నవంబర్ 20 -- శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అలర్ట్ ఇచ్చింది. అలిపిరిలోని శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను 10 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు ఈ టికెట్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని గమనించి భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

వైకుంఠ ద్వార దర్శనం డిసెంబర్ 30 నుండి జనవరి 08 వరకు భక్తులకు కల్పించనున్నారు. 10 రోజుల పాటు 8 లక్షల మంది భక్తుల కోసం వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే అవకాశం ఉంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టుగా టీటీడీ అధికారులు తెలిపారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....