Andhrapradesh,tirumala, మే 22 -- తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను వేలం వేయనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం వివరాలను వెల్లడించింది.
భక్తులు కానుకగా సమర్పించిన ఉపయోగించిన / పాక్షికంగా దెబ్బతిన్న 62 లాట్ల వాచీలను టీటీడీ వేలం వేయనుంది. జూన్ 2వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా ఈ - వేలం వేయనున్నారు. వీటిలో టైటాన్, సిటిజెన్, సొనాటా, రాగ, టైమ్స్ వన్, టైమ్స్, టైమెక్స్ తదితర స్మార్ట్ వాచీలు ఉన్నాయి.
ఆసక్తి కల్గిన భక్తులు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ - కొనుగోలు పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని వాచీల వేలంలో పాల్గొనటానికి అర్హులవుతారు. ఇతర వివరాలకు స్థానిక జనరల్ మేనేజర్ ( వేలములు) / ఏఈవో ( వేలములు)లను సంప్రదించాలి. https://konugolu.ap.gov.in లేదా www.tirumala.org వెబ్ సైట్ ను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.