Andhrapradesh, జూలై 20 -- శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్డేట్ ఇచ్చింది. ఆలయం పక్కన ఉన్న పవిత్రమైన స్వామివారి పుష్కరిణి మరమ్మతు పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి (జూలై 20) ఆగస్టు 19వ తేదీ వరకు మరమ్మత్తు పనులు ఉంటాయని పేర్కొంది.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఏడాది పుష్కరిణి మరమ్మతులు నిర్వహిస్తారు. ఈ ఏడాది సెప్టెంబరు 24 నుంచి శ్రీవారి బ్రహ్మూత్సవాలు జరపాలని టీటీడీ ఇప్పటికే నిర్ణయించింది.

బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారైన నేపథ్యంలో టీటీడీ వాటర్‌ వర్క్స్‌ విభాగం ఆధ్వర్యంలో నెల రోజుల ముందుగానే ఈ పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కావున ఈ నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదని టీటీడీ తెలిపింది.

ఈ నెల రోజుల పాటు భక్తులను పుష్కరిణిలోకి అనుమతించరని టీటీడీ వెల్లడించింది. ఈ వ...