Tirumala,andhrapradesh, సెప్టెంబర్ 17 -- శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్డేట్ ఇచ్చింది. అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో మార్పు తీసుకొచ్చింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఫిఫో ( ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్) పద్ధతి స్థానంలో లక్కీ డిప్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. టోకెన్లు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో లక్కీ డిప్ సిస్టమ్ ద్వారా విడుదలవుతాయి.

డిసెంబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్ల కోసం సెప్టెంబర్ 18వ తేదీ లేదా 20వ తేదీ వరకు లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లక్కీ డిప్ ద్వారా ఎంపికైన భక్తులకు ఈ టోకెన్లను కేటాయిస్తారు.

శుక్రవారాలు మినహా ప్రతిరోజూ 750 టోకెన్లు, శనివారాల్లో 500 టోకెన్లు జారీ చేయడం జరుగుతుందని టీటీడీ పేర్కొంది. భక్తులు తిరిగి ఈ సేవ పొందేందుకు గడువు 90 రోజుల బదులు 180 రోజులుగా నిర్ణయించ...